జనరల్ గా ఐపీఎల్ లాంటి స్టేజ్ లో ఫస్ట్ హాఫ్ సెంచరీ అంటే ఎంత అపురూపంగా ఉంటుంది. మనం పడిన ఎన్నో కష్టాలకు సమాధానం అది అని బ్యాటర్లంతా భావిస్తారు. అలాంటిది 14ఏళ్లకే ఐపీఎల్ ఆడేస్తూ సంచలనం సృష్టిస్తున్న రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ లాంటి వాడికి ఇంకా అది ప్రత్యేకం కదా. అంత చిన్న ఏజ్ లో హాఫ్ సెంచరీ కొట్టడమంటే. కానీ నిన్న గుజరాత్ మీద 17 బాల్స్ లో హాఫ్ సెంచరీ బాది ఈ సీజన్ లోనే అతి తక్కువ బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టినా కనీసం బ్యాట్ కూడా ఎత్త లేదు సూర్యవంశీ. జస్ట్ బ్యాట్ తో తన వీపు మీద ఉన్న పేరు ను చూపిస్తూ జైశ్వాల్ కి షేక్ హ్యాండ్ ఇస్తూ సైలెంట్ అయిపోయాడు అంతే. అందేటీ ఈ బుడ్డోడు కనీసం హాఫ్ సెంచరీ కొట్టి బ్యాట్ ఎత్తలేదు అనుకున్నారు అంతా. కానీ తన మనసులో ఉన్నదేంటో తెలుసా ఈ రోజు సెంచరీ కొట్టాకనే బ్యాట్ ఎత్తాలి అని. ఎందుకంటే సరిగ్గా పదిరోజుల క్రితం తన మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడిన సూర్యవంశీ ఆ మ్యాచ్ లో 34 పరుగులకే అవుట్ అయ్యి నిరాశపడ్డాడు. అవుటై వెళుతూ వెళుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అందుకే ఈ సారి టార్గెట్ హాఫ్ సెంచరీ కాదు. ఏనుగు కుంభస్థలం బద్ధలు కొట్టేయటమే. కచ్చితంగా సెంచరీ కొట్టాలనే తన ఉడుకు రక్తం సాక్షిగా హాఫ్ సెంచరీ తర్వాత పదే పదినిమిషాల్లో పెను విధ్వంసం సృష్టించారు. 17 బాల్స్ లో హాఫ్ సెంచరీ..35 బంతుల్లో సెంచరీ బాదేశాడు. అప్పుడు బ్యాట్ ఎత్తాడు. తన గురువు రాహుల్ ద్రవిడ్ కి బ్యాట్ తో నే ఓ సెల్యూట్ కొట్టి తనొచ్చానని తన పేరు వైభవ్ సూర్యవంశీ అని ఘనంగా ప్రపంచానికి చాటి చెప్పాడు వైభవ్ సూర్యవంశీ.